బీసీలకు కేంద్రం అన్యాయం చేస్తోంది

బీసీలకు కేంద్రం అన్యాయం చేస్తోంది
  • ప్రధానిగా ఓబీసీ ఉన్నా బీసీలకు ఒరిగిందేమి లేదు: కృష్ణయ్య

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలోని బీజేపీ సర్కార్ బీసీలకు అన్యాయం చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఓబీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోదీ ప్రధాని అయినా.. బీసీలకు చేసిందేమీ లేదన్నారు. శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్‌‌‌‌లో కృష్ణయ్య నేతృత్వంలో బీసీల సమస్యలు పరిష్కరించాలని మహాధర్నా నిర్వహించారు. కృష్ణయ్య మాట్లాడుతూ.. జన గణనలో కులాలవారిగా జనాభా లెక్కలు తీయాలని, చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. 

బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయానికి అల్టిమేటం జారీ చేశారు. దేశంలో 76 కోట్లకు పైగా ఉన్న బీసీలకు కేంద్ర బడ్జెట్‌‌లో రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం మేల్కొని రూ.2 లక్షల కోట్లు కేటాయించి బీసీల అభ్యున్నతికి ఖర్చు చేయాలన్నారు. చేతి వృత్తులు చేసే ప్రతి బీసీ కుటుంబానికి రూ.20 లక్షలు ఇచ్చి ఆర్థికంగా ఎదిగేందుకు సహాయం చేయాలని కోరారు.