టీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలె

పేదల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్రమంత్రి బీఎల్ వర్మ అన్నారు. పార్లమెంట్ ఆవాస్ యోజనలో భాగంగా హన్మకొండలో ఆయన పర్యటించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. రైతులు, కార్మికులకు జన్ ధన్ ఖాతాలు ఇచ్చామన్నారు. కేంద్రం నుండి వివిధ పథకాల డబ్బులను జన ధన్ ఖాతాల్లోనే జమ చేస్తున్నట్లు తెలిపారు. పేదలకు ఆవాస్ యోజన ద్వారా సొంతింటి కలను నిజం చేస్తున్నామని చెప్పారు.

దేశంలో లక్షల ఇండ్లు నిర్మించామని బీఎల్ వర్మ తెలిపారు. కేంద్రం ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చిన నిధులను కేసిఆర్ ప్రభుత్వం ఇతర పనులకు మళ్లించిందని ఆరోపించారు. దళితులకు 3ఎకరాల భూమి ఇస్తామని మోసం చేయడంతోపాటు అయుష్మాన్ భారత్ లో చేరకుండా నిరుపేదలకు వైద్యం దూరం చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమాల టీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.