ఇద్దరి పేర్లతో పెద్దపల్లి బీఫామ్ ఇచ్చిన బీజేపీ

ఇద్దరి పేర్లతో  పెద్దపల్లి  బీఫామ్ ఇచ్చిన బీజేపీ

పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థుల పేర్లతో కూడిన బీఫామ్ ఇచ్చింది బీజేపీ. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి  గోమాస శ్రీనివాస్ ..  అయితే  ఆల్టర్నేటివ్  అభ్యర్థిగా బీపామ్ లో ఎస్. కుమార్ పేర్లను పెట్టింది బీజేపీ. పెద్దపల్లి బీజేపీ  అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ ను ఇదివరకే అధికారికంగా ప్రకటించింది బీజేపీ.  

గత కొన్ని రోజులుగా  గోమాస శ్రీనివాస్ ను మారుస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెంకటేష్ నేతను పార్టీలో చేర్చుకొని బీజేపీ టికెట్ ఇవ్వబోతుందని  ప్రచారం జరిగింది.    బీపామ్ లేకుండానే పెద్దపల్లి అభ్యర్థిగా ఏప్రిల్ 24న  నామినేషన్ వేశారు గోమాస శ్రీనివాస్.  పార్టీ బీఫామ్ ఇవ్వకపోవడంతో ఎన్నికల అధికారికి  బీపామ్  ఇవ్వలేదు  గోమాస శ్రీనివాస్. ఏప్రిల్ 25న నామినేషన్లకు చివరి రోజు కావడంతో తప్పకుండా  బీఫామ్ ఇవ్వాలి.  దీంతో ఇవాళ గోమాస శ్రీనివాస్ కు బీఫామ్ ఇచ్చింది బీజేపీ. 
 
పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ. బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీచేస్తున్నారు. వంశీకృష్ణ ఇప్పటికే  ప్రచారంలో దూసుకుపోతున్నారు.  కాంగ్రెస్ గెలవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.