తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై టీ బీజేపీ ట్వీట్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీ బీజేపీ సెటైరికల్ట్వీట్చేసింది. ‘ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడినట్టు.. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాల పేరు లేవని సోది వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్నాయకులారా! నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తర్కవంతమైన ప్రశ్నలు అడగలేక కాంగ్రెస్ లేవనెత్తిన అంశమే తమను పాములా కాటేసింది! మీ లాజిక్ ప్రకారం కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పేరు లేకపోతే మనకు ఏమీ రానట్లైతే.. మరి రాష్ట్ర బడ్జెట్ లో ప్రస్తావించని జిల్లాలకూ ఏ నిధులు కేటాయించనట్టేనా రేవంత్ రెడ్డి?? అసత్య ప్రచారాలపై అధికారం చేపట్టిన మీకు.. చైతన్యవంతమైన తెలంగాణ సమాజం చేతిలో శిక్ష తప్పదు’ అంటూ ట్వీట్‌చేసింది.