మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ దూకుడు

ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీజేపీ మునుగోడు నుంచి పుట్టపాక మీదుగా సంస్థాన్​ నారాయణపురం, చౌటుప్పల్ మండలాల్లో భారీ బైక్​ ర్యాలీ నిర్వహించింది. బీజేపీ క్యాండిడెట్​ రాజగోపాల్​రెడ్డితోపాటు ఎంపీ ధర్మపురి అర్వింద్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

వేలాది మంది బీజేపీ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం చౌటుప్పల్​ టౌన్​లో రోడ్​ షో నిర్వహించారు.