అరుణాచల్ ప్రదేశ్ లో ముందంజలో బీజేపీ.. సిక్కింలో ఎస్ కే ఏం పార్టీ ముందంజ..

అరుణాచల్ ప్రదేశ్ లో ముందంజలో బీజేపీ.. సిక్కింలో ఎస్ కే ఏం పార్టీ ముందంజ..

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు అంతా జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏడో దశ ఎన్నికలు ముగియగానే ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి. ఇదిలా ఉండగా రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు రెండు రోజుల ముందే ప్రారంభం అయ్యింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు ముగియటంతో కౌంటింగ్ ముందే ప్రారంభించింది ఎన్నికల సంఘం.

ఇవాళ ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ రెండు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతోంది. అరుణాచల్ ప్రదేశ్ లో అధికార బీజేపీ 27సీట్లలో గెలుపొంది 21సీట్లలో ముందంజలో అధికారం దిశగా దూసుకుపోతోంది. ఇక సిక్కింలో ఎస్ కే ఎం 15స్థానాల్లో గెలుపొంది 16సీట్లలో ముందంజలో దూసుకుపోతోంది.