ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి లీడ్ లో దూసుకుపోతోంది. అధికారం లాంభనప్రాయమే. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ లో ఒక్క సీట్ కు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపు దిశగా దూసుకుపోతోంది. యూపీ మిల్కిపూర్ లో 18 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాశ్వా్న్ 42,880 ఓట్లతో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అజిత్ ప్రసాద్ పై ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
తమిళనాడులోని ఎరోడ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో డీఎంకే (DMK) ముందంజలో ఉంది. ఏఐఏడిఎంకే(AIADMK) తో సహా ఇతర పార్టీలు ఎన్నికలు బహిష్కరించడంతో డీఎంకే, తమిళ్ నేషనలిస్ట్ పార్టీల మధ్యే పోటీ ఉంది. అయితే ఈ స్థానానికి మొత్తం 46 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో 44 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.
ALSO READ | కేజ్రీవాల్‌పై ఘన విజయం.. పర్వేష్ వర్మ ఫస్ట్ రియాక్షన్ ఇదే
ఎరోడ్ స్థానంలో 2023 లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే EVKS ఎలాంగ్వన్ అకాల మరణంతో ఉప ఎన్నికలు వచ్చాయి.