మంత్రులు ఇన్ ఛార్జ్‌లుగా ఉన్న గ్రామాల్లో ఆధిక్యంలో బీజేపీ

మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ రౌండ్ రౌండ్ కి ఆసక్తి రేకెత్తిస్తోంది. మొదటి రౌండ్ లో అధికార పార్టీ ముందంజలో ఉన్నా.. తర్వాత 2, 3 రౌండ్లలో బీజేపీ వైపు మళ్లింది. 4వ రౌండ్ లో మళ్లీ టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది. ఇలా రౌండ్ రౌండ్ కి కౌంటింగ్ లో మార్పు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా నువ్వా నేనా అని సాగుతున్న మునుగోడు పోరులో టీఆర్ఎస్ మంత్రులకు గట్టి షాక్ తగిలింది. మంత్రి మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లు ఇన్ ఛార్జీలుగా ఉన్న పలు గ్రామాల్లో బీజేపీ ఆధిక్యత కనబర్చింది. మంత్రి మల్లారెడ్డి ఇన్ చార్జీగా వ్యవహరించిన ఆరెగూడెం, రెడ్డిబావిలో బీజేపీ లీడ్ లో నిలిచింది.