హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్షం బీజేపీయనని ఆ పార్టీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఉత్తర తెలంగాణ బీజేపీ అడ్డా అని ఆయన పేర్కొన్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. టీచర్లు, పట్టభద్రుల సమస్యల గురించి కొట్లాడేది కాషాయ పార్టీ మాత్రమేనన్నారు. బీఆర్ఎస్ ఫాం హౌస్ పార్టీ అని, కాంగ్రెస్ అవినీతి పార్టీ అని విమర్శించారు. అదే బీజేపీ పేరు, మంచి గుర్తింపు ఉన్న వారికే టికెట్లు కేటాయించిందని పేర్కొన్నారు.