దేశంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తెస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ లో షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేసిన కల్వకుంట్ల కవిత... ఆడబిడ్డల పెళ్లికి సర్కారు ఇచ్చే కానుకే కళ్యాణ లక్ష్మీ అని చెప్పారు. ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలే కేసీఆర్ చేపడుతున్నారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల ఆశీస్సులు, ఆశీర్వాదం తినే కేసీఆర్ .. బీఆర్ఎస్ ఏర్పాటు చేశారని ఎమెల్సీ కవిత స్పష్టం చేశారు. నగరంలో పాత భవనాల కూల్చివేతలపై బీజేపీ అనవసర ఆందోళనలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో అసంతృప్తిగా వదిలేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు తాము పూర్తి చేశామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.