బీజేపీ ఎవరి అయ్యా పార్టీ కాదు..

బీజేపీ ఎవరి అయ్యా పార్టీ కాదు..
  • ఈటల చేరితే మేం వెళ్తామనే వారెవరూ లేరు
  • ఈటల వస్తే.. ఆయనతోపాటు మరికొంత మంది టీఆర్ఎస్ నేతలు వచ్చే అవకాశం ఉంది
  • బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్: ‘‘బీజేపీ ఎవరి అయ్యా పార్టీ కాదు.. పార్టీ నియమాల ప్రకారం ఎవరన్నా చేరొచ్చు.. ఈటల వస్తే మేం పార్టీలో ఉండమని బెదిరించే వారెవరూ లేరు.. అలాంటి వారెవరైనా ఉంటే వారి మాటలను బీజేపీ లెక్కచేయదు..’’ అని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. ఈటల చేరికను కొందరు అడ్డుకుంటున్నట్లు.. అభ్యంతరం చెబుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. తన అభిప్రాయాలను కొండబద్దలు కొడుతూ వీడియో విడుదల చేశారు. 

ఈటల బీజేపీలో చేరితే పార్టీకి లాభం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈటల చేరితో చాలా మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీ లో చేరే అవకాశం ఉందని రాజాసింగ్ పేర్కొన్నారు. ‘‘ఈటల తెలంగాణ కోసం పోరాడిన ముఖ్యమైన వ్యక్తి.. ఆయన చేరికతో బీజేపీ బలం పుంజుకుంటుంది.. ఈటల చేరితే మేము వెళ్లిపోతాం అని కొందరు అంటున్నట్టు ప్రచారం జరుగుతోంది... అది ఫేక్.. నిజంగా ఎవరన్నా బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే..  వారు అడ్రస్ లేకుండా పోతారు..’’ రాజాసింగ్ హెచ్చరించారు.