స్థానిక ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీకి బీజేపీ సై

స్థానిక ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీకి బీజేపీ సై
  • మెజార్టీ స్థానాలు గెలిచేందుకు ప్లాన్‌‌ రెడీ చేస్తున్న పార్టీ నాయకత్వం
  • త్వరలో మండలానికో ఇన్‌‌చార్జ్​ నియామకం
  • జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థానాల్లో పోటీకి సన్నద్ధం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఈ మేరకు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండేలా ప్లాన్ రెడీ చేస్తున్నది. ఈసారి ప్రతి జడ్పీటీసీ స్థానంతో పాటు గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకూ పోటీ చేయాలని డిసైడ్ అయింది. దీని కోసం ఇప్పటి నుంచే ప్యానెల్ రెడీ చేసుకోవాలని అధిష్టానం రాష్ట్ర కమిటీకి ఆదేశాలిచ్చింది. దీంతో ఈ ప్రక్రియను రాష్ట్ర నాయకత్వం మొదలుపెట్టింది. రాష్ట్రంలో 2018, 2019 సంవత్సరాల్లో లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో బీజేపీ పెద్దగా స్థానాలను గెలుచుకోలేకపోయింది. గెలిచిన కొందరు కూడా బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, తాజాగా గెలిచిన రెండు స్థానాలతో కలిసి ముగ్గురు ఎమ్మెల్సీలూ ఉన్నారు. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో అధిక స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తున్నది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ జాతీయ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇందులో ప్రధానంగా తెలంగాణలో కమలం పార్టీకి పట్టు ఉండటంతో, దాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని యోచిస్తున్నది. 

ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జీల నియామకం..

బీజేపీ స్టేట్ ఆఫీసులో రెండ్రోజుల క్రితం ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి సునీల్ బన్సల్ రాష్ట్ర నాయకత్వంతో వేర్వేరు అంశాలపై విడివిడిగా సమావేశమయ్యారు. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు. ప్రత్యేకంగా రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టాలని, లోకల్ ఇష్యూపై ఆందోళనలు చేయాలని ఆదేశించారు. దీంతో ప్రతి జడ్పీటీసీ స్థానానికి ఒక ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జిని నియమించాలని డిసైడ్ అయ్యారు. దీంతో పాటు జిల్లాకొక ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జిని పెట్టనున్నారు. ఈ లెక్కన సుమారు 570 జడ్పీటీసీ స్థానాలతో పాటు 5 వేల ఎంపీటీసీ స్థానాల్లో పోటీకి రెడీ అవుతున్నారు. 32 జిల్లా పరిషత్ స్థానాల్లో మెజార్టీ స్థానాలను గెలిచేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. అయితే, రిజర్వేషన్లు ఎలా వస్తాయో తెలియదు కాబట్టి.. ప్రతిస్థానం నుంచి ముగ్గురు, నలుగురు పేర్లతో ప్యానెల్ రెడీ చేస్తున్నారు. అప్పటి అవసరాలకు అనుగుణంగా అవసరమైన మార్పులు చేయాలని యోచిస్తున్నారు. దీనిపై ఈ నెల 15, 16 తేదీల్లో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నది.