రాష్ట్రంలో అవినీతి.. కుటుంబ పాలన సాగుతోందని కేంద్రమంత్రి దేవుసిన్హా చౌహన్ ఆరోపించారు. ప్రధాని వస్తే సీఎం స్వాగతం పలకకపోవడం సిగ్గుచేటన్న ఆయన.. కేసీఆర్ ప్రవర్తించిన తీరు తెలంగాణ సంస్కృతికి విరుద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. తెలంగాణలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని.. రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు నాయకులు సమిష్టిగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధిలో పురోగమిస్తోందని.. ప్రపంచ దేశాలలో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని దేవుసిన్హా చౌహన్ అన్నారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నట్లు తెలిపారు. పట్టణాల్లో 5జీ టెక్నాలజీకి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.