హనుమకొండ, వెలుగు: బీజేపీ అబద్దాలతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇండియా కూటమిలో భాగంగా హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా ఆఫీస్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర లీడర్ తక్కళ్లపెల్లి శ్రీనివాస రావు, ఇతర నేతలతో మంగళవారం సమావేశమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు సీపీఐ లీడర్లు మద్దతు తెలిపారు.
కడియం మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకుందని, వామపక్ష భావజాలన్ని, అం బేద్కర్ వాదాన్ని అణచివేస్తోందని విమర్శించారు. అందుకే ప్రజలందరూ కాంగ్రెస్ ను గెలిపించడానికి సిద్ధమయ్యారన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి, భూపాలపల్లి జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్, జనగామ జిల్లా కార్యదర్శి రాజిరెడ్డి పాల్గొన్నారు.