ఎంపీ రమేష్ బిధూరికి బీజేపీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. లోక్ సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనతో ఎంపీ రమేష్ బిధూరికి ఈ షోకాజ్ నోటీసు జారీ చేశారు.
సెప్టెంబర్ 21న లోక్ సభలో చంద్రయాన్-3 విజయంపై చర్చ జరుగుతుండగా.. బీఎస్పీ ఎంపీ దనీశ్ అలీ మిలిటెంట్ అని, ఉగ్రవాది అని బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి వ్యాఖ్యానించారు. దీనిపై ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరం చెప్పారు. బీజేపీ ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా రమేష్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే తీరు కొనసాగితే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
Also Read : ప్రగతి భవన్కు జనగామ పంచాయతీ..రాజీ కుదిరేనా?
బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై బీఎస్పీ ఎంపి డానిష్ అలీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు . స్పీకర్‌గా మీ నేతృత్వంలో కొత్త పార్లమెంటు భవనంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమన్నారు. ఒక ఎంపీగా నిజంగా తనకు చాలా హృదయ విదారకంగా ఉందని డానిష్ అలీ అన్నారు. తనపై అవమానకరమైన పదాలు వాడారని..తనపై చేసిన వ్యాఖ్యలను ప్రివిలేజీ కమిటీ పరిశీలనకు పంపాలని కోరారు.
BJP issues show cause notice to party MP Ramesh Bidhuri on instruction of party president JP Nadda for his use of unparliamentary language against BSP MP Danish Ali: Sources pic.twitter.com/bT5JDhclCB
— ANI (@ANI) September 22, 2023