పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన సుమారు 50 మంది యువకులు బీజేపీలో చేరారు. బుధవారం హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. ఎన్‌ఆర్‌ఐ ధ్యాగేటి ఉదయ్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని చెప్పారు. ఆయన నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు లీడర్లు వివేక్ వెంకటస్వామిని ధర్మపురి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యనారాయణ, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కిసాన్ మోర్చా నియోజకవర్గ ఇన్‌చార్జి సతీశ్ రెడ్డి, లీడర్లు తిరుపతి, దేవి రజినీకాంత్, ప్రసాద్, మనోహర్ రెడ్డి, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.