
బీజేపీ మహిళా నాయకురాలిని హత్య చేసి హైవేపై పడేసిన ఘటన అసోంలో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్పరా జిల్లా కు చెందిన బీజేపీ కార్యదర్శి జోనాలినాథ్ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అనంతరం కృష్ణాయ్లోని సల్పరా వద్ద నేషనల్ హైవే 17 సమీపంలో పడేశారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పక్కా ప్లాన్ప్రకారమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
సంతాప తెలిపిన నేతలు..
జొనాలినాథ్ మృతి పట్ల అసోం నేతలు సంతాపం తెలిపారు. అసోం మంత్రి బిమల్ బోరా మాట్లాడుతూ.. ఆమె మృతి విషాదకరమని అన్నారు. నిందితులకు శిక్ష పడేలా చేసి వారి కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. నిబద్ధత, అవిశ్రాంతంగా పని చేసే గొప్ప వ్యక్తిని పార్టీ కోల్పోయినట్లు బీజేపీ అధికార ప్రతినిధి జ్యూరీ శర్మ బోర్డోలోయ్ అన్నారు. ఆమెను హత్య చేసిన నిందితులను పట్టుకునేలా సమగ్ర విచారణ జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.