
- రేవంత్ దిగజారుడు మాటలకు నిదర్శనం: లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీని మహ్మ ద్ గజినీతో పోల్చుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలు హిందూ ధార్మికతను అవమానించేలా ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు.
రేవంత్ రెడ్డి మాటలు దిగజారిన రాజకీయాలకు, చౌకబారు మాటలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. “మహ్మద్ గజినీ దేశాన్ని దోచుకున్నాడు. హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి మన సాంస్కృతిక వారసత్వాన్ని మట్టిలో కలిపాడు. అలాంటి దోపిడీదారుడితో ప్రధాని మోదీని పోల్చడం సరికాదు”అని పేర్కొన్నారు.