ఎలక్షన్లో డబ్బు పంచుతూ బీజేపీ లీడర్లు : వీడియో వైరల్

ఎలక్షన్లో డబ్బు పంచుతూ బీజేపీ లీడర్లు : వీడియో వైరల్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నవంబర్ 18న ముగిసింది. 20న(బుధవారం) పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో బీజేపీ నాయకులు ఓ హోటల్ డబ్బులు పంచుతున్నట్లు వీడియో ఒకటి వైరల్ అవుతుంది. పాల్ఘర్ జిల్లాలోని విరార్‌లోని ఓ హోటల్‌లో బీజేపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి వినోద్ తావ్డేతో సహా బిజెపి నాయకులు డబ్బులు పంచుతున్నారని చేశారని ప్రాంతీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్స్ లో షేర్ చేసింది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 4136 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నవంబర్ 23న ఫలితాల వెలువడనున్నాయి. 

ALSO READ | బీజేపీలోకి కైలాశ్ గెహ్లాట్

నాలసోపరా నుంచి బిజెపి అభ్యర్థి రాజన్ నాయక్ ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బులు పంచుతున్నారని బహుజన్ వికాస్ అఘాడి ఆరోపించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే క్షితిజ్ ఠాకూర్ తన అనుచరులతో హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బహుజన్ వికాస్ అఘాడీ కార్యకర్తలు మిస్టర్ తావ్డేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్టేజ్ దగ్గర నోట్ల కట్టులు, డైరీలతో కూడిన కవరు ఉన్నట్లు వారు చెప్తున్నారు. బహుజన్ వికాస్ అఘాది కార్యకర్తలు డబ్బులు చేత్తో ఊపుతూ వీడియో తీశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.