మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మతిభ్రమించింది : ఏలేటి మహేశ్వర్ రెడ్డి 

మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మతిభ్రమించింది : ఏలేటి మహేశ్వర్ రెడ్డి 
  • బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్
  • గోదావరి లో ఫ్యాక్టరీ నిర్మాణం ప్రమాదకరం
  • ఆయిల్ పామ్ రైతులకు అండగా ఉంటాం

నిర్మల్, వెలుగు: అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నానంటూ మాజీ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఆరోపణలు చేయడం అర్థరహితమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయిల్ ఫామ్ రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ నిర్మాణ స్థలం గోదావరి పరివాహకంలో ఉందని, దీని కారణంగానే ఇరిగేషన్ శాఖ క్లియ రెన్స్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

కాగా మాజీ మంత్రి ఆ ప్రాంతంలోని తన భూములకు డిమాండ్ సృష్టించేందుకునేందుకే  ప్రైవేట్ కంపెనీ చేత పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని నిర్మించేందుకు  ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. పదేండ్లు మంత్రిగా కొనసాగిన ఇంద్రకరణ్ రెడ్డి ఓటమిపాలు కాగానే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడం సిగ్గుచేటని విమర్శించారు.

 ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ విదేశీ కంపెనీ కాదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బంధువులదని చెప్పారు. భూములను ఆక్రమించుకుంటూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడడం మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో పాటు ఆయన బంధువులకు పరిపాటేనని ఆరోపించారు. మూడు నెలల్లో డి వన్ పట్టాల గుట్టు రట్టు చేస్తానన్నారు. రూల్స్ కు విరుద్ధంగా రూపొందిన మాస్టర్ ప్లాన్ పై అసెంబ్లీలో చర్చించి దానిని రద్దు చేయిస్తానన్నారు. పార్టీ పెద్దపల్లి జిల్లా ఇన్ చార్జ్ రావుల రామనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్ పార్టీ నేతలు ఉన్నారు.