
మహబూబ్నగర్, వెలుగు: మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఈద్గాన్పల్లి, కుర్వపల్లి గ్రామాల ప్రజల ఇబ్బందులు తీరిపోయాయి. ఈ గ్రామాల మధ్య బీటీ రోడ్డు వేయాలని కోరుతున్నా స్థానిక లీడర్లు పట్టించుకోలేదు. దీంతో విషయాన్ని గ్రామస్తులు బీటీఎస్ ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ దృష్టికి తీసుకెళ్లారు. సంస్థ అధినేత, బీజేపీ జిల్లా నాయకురాలు ఆర్ బాలాత్రిపుర సుందరి స్పందించారు. ఆదివారం ఉదయం ఈద్గాన్పల్లి నుంచి కుర్వపల్లి వరకు రెండు కిలోమీటర్ల మేర రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అడిగిన వెంటనే రోడ్డు వేయించేందుకు సొంతంగా నిధులు సమకూర్చడంతో రెండు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.