కేటీఆర్, కేసీఆర్కు తెలంగాణలో తిరిగే అర్హత లేదు: బండి సంజయ్

కరీంనగర్: ప్రధాని మోదీని విమర్శించే అర్హత మంత్రి కేటీఆర్ కు లేదన్నారు బీజేపీ నేత బండి సంజయ్. తెలంగాణలో అడుగుపెట్టే అర్హత ఒక్క మోదీకే ఉంది..ప్రజలను మోసం చేసిన  కేసీఆర్ కుటుంబానికే తెలంగాణలో తిరిగే అర్హత లేదన్నారు బండి సంజయ్. 

కృష్ణా జలాల వాటాపై సీఎం కేసీఆర్ చేశారని.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు డీపీఆర్ ఇవ్వకుండా కేంద్రంపై విమర్శిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఇటీవల ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఒక్క మోటారు ప్రారంభించి ఎన్ని లక్షల ఎకరాలకు నీరిస్తున్నారని ప్రశ్నించారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్ఫిట్ అంటూ.. కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు. కిషన్ రెడ్డి కాదు.. పాలనలో కేటీఆర్ అన్ ఫిట్ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నా కేటీఆర్, కేసీఆర్ కు తెలంగాణలో తిరిగే అర్హత లేదని బండి సంజయ్ అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చింది.. భాగ్యలక్ష్మీ టెంపుల్ దగ్గర తేల్చుకుందాం.. కేటీఆర్ కు సవాల్ విసిరారు బండి సంజయ్. 

కేంద్రం నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి రూ. 9లక్షల కోట్లు నిధులు ఇచ్చిందని మేం రుజువు చేస్తాం.. తొమ్మిదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు ఇచ్చారు.. ఎన్ని హామీ లు నెరవేర్చారు.. రాష్ట్రాన్ని అప్పుల పాలు  ఎందుకు చేశారో.. తేల్చుకుందాం.. భాగ్యలక్ష్మీ టెంపుల్ దగ్గర చర్చకు రావాలని..ఇదే  రాబోయే ఎన్నికల రెఫరెండం.. అని బండి సంజయ్ కేటీఆర్  కు సవాల్ విసిరారు.  అని బండి సంజయ్ కేటీఆర్  కు సవాల్ విసిరారు.