- బడ్జెట్లో నిధులు బాగానే కేటాయించింది
- కాంగ్రెస్, బీఆర్ఎస్వీ అవకాశవాద రాజకీయాలని ఫైర్
కరీంనగర్, వెలుగు: బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరగలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోలేదని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో పాటు ఓ సెక్షన్ మీడియా చేస్తున్న ప్రచారంలో నిజం లేదని బుధవారం ఓ ప్రకటనలో ఆయన మండిపడ్డారు. ‘‘కరీంనగర్ పార్లమెంట్‌తో పాటు తెలంగాణ రాష్ట్రం దేశంలో అంతర్భాగమనే విషయం గుర్తు పెట్టుకోవాలి.
ప్రతి స్కీమ్‌కు కేంద్రం ఖర్చు చేసే నిధుల్లో కరీంనగర్ సహా తెలంగాణకూ వాటా ఉంటుందని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సోయి మరిచిన్రు. అవకాశవాద రాజకీయాలకు దిగుతున్నరు. కేంద్రంపై దుష్ర్పచారం చేస్తున్నరు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి పల్లె, పట్టణంలో జరిగే అభివృద్ధిలో కేంద్ర నిధులు ఉన్నయ్. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఐదేండ్లలో రూ.8వేల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేశామనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కరీంనగర్–వరంగల్, ఎల్కతుర్తి–సిద్దిపేట జాతీయ రహదారి నిర్మాణం, కరీంనగర్ ఆర్వోబీ నిర్మాణం, రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, స్మార్ట్ సిటీ నిధులు కేంద్రానివే’’అని పేర్కొన్నారు.