కాంగ్రెస్​ది శాంపిల్స్ సర్కార్ : బూర నర్సయ్య గౌడ్

కాంగ్రెస్​ది శాంపిల్స్ సర్కార్ :  బూర నర్సయ్య గౌడ్
  • ఏ స్కీమ్ అయినా ఒకట్రెండు చోట్లే అమలు చేస్తున్నరు:  బూర నర్సయ్య గౌడ్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్​ది శాంపిల్స్ సర్కార్ అని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. ఏ పథకమైనా.. ఒకటి రెండు చోట్ల మాత్రమే అమలు చేస్తున్నారన్నారు. ఐదేండ్లలో రావాల్సిన వ్యతిరేకత.. సీఎం రేవంత్ రెడ్డిపై ఏడాదిలోనే వచ్చిందని విమర్శించారు. రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు కావాలంటే మోదీ పేరు, ఫొటో పెట్టాలని సూచించారు. రేషన్ కార్డుపై కూడా మోదీ ఫొటో పెట్టాల్సిందే అని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను ఫొటోల కారణంగా నాశనం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. 

ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మూసీ అభివృద్ధిని బీజేపీ వ్యతిరేకించలేదు. నిర్వాసితులకు న్యాయం చేయాలన్నది బీజేపీ డిమాండ్. మేము అధికారంలోకి వస్తే సబర్మతి నది కంటే గొప్పగా మూసీని డెవలప్ చేస్తాం. ఢిల్లీలో శుభ్రత లేదు. రోడ్లు సరిగ్గా లేవు. కరెంట్ సరఫరా చేయడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ పేరును.. అమీర్ ఆద్మీ పార్టీగా మార్చుకోవాలి. రూ.1,000 నుంచి రూ.2,000 పంచుకుంటూ ఓటర్లను ఆప్ లీడర్లు ప్రలోభపెడ్తున్నారు’’అని బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. గద్దర్​కు అవార్డులు ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు అనడం సరికాదని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. గద్దర్​కు ఎందుకు అవార్డు ఇవ్వాలో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.