కేసీఆర్కు అంతా నేనే అనే మానసిక వ్యాధి ఉన్నట్టుంది : బూర

సీఎం కేసీఆర్ వ్యవహార శైలి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారిందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ తెలంగాణలో ప్రజాస్వామ్యం అనే పదం బూతుపదంగా మారిందన్నారు. కేసీఆర్ కు అంతా నేనే అనే మానసిక వ్యాధి ఉన్నట్టుందని ఆరోపించారు. నార్త్ కొరియాలాగా రాష్ట్రంలో కూడా కుటుంబపాలన కొనసాగించాలని కేసీఆర్ అనుకుంటున్నాడని బూర విమర్శించారు.

కేసీఆర్కు నిజాం ఆత్మ ఆవహించినట్టుందని అందుకే సెక్రటేరియట్ను ప్యాలెస్ లాగా కడుతున్నాడని బూర నర్సయ్య గౌడ్ సటైర్ వేశారు. రానున్న బడ్జెట్ ను అయినా వాస్తవాలకు అనుగుణంగా రూపొందించాలని కోరారు. భూ నిర్వాసితులకు వెంటనే నిధులు విడుదల చేయలని, లేనిపక్షంలో  ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 70 సీట్లలో విజయం సాధించి అధికారాన్ని చేపడుతుందని బూర నర్సయ్య గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.