
- ఏడాదిలో అన్ని రంగాల్లో విఫలం: బూర నర్సయ్య గౌడ్
హైదరాబాద్, వెలుగు: ఏడాది పాలనలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. రేవంత్ రెడ్డిది 5డీ పాలన అని.. 5 డీ అంటే డైవర్షన్, డెమాలిషన్, డిస్ట్రక్షన్, డిసీవింగ్, ఢిల్లీ బ్లేమ్ గేమ్ అని నిర్వహించించారు. మంగళవారం ఆయన బీజేపీ స్టేట్ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. రేవంత్ కు ఢిల్లీ , మోదీ జపం లేనిదే నిద్ర రావడం లేదన్నారు.
సీఎంగా రేవంత్ ప్రమాణం చేసి 420 రోజులైందని, ఇందులో 40 సార్లు ఢిల్లీకి వెళ్లారని, ఆయన ఢిల్లీలోనే సెక్రటేరియెట్ పెట్టుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. రేవంత్ తెలంగాణకు ముఖ్యమంత్రా..? ఢిల్లీకా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ రేవంత్ ను నమ్మట్లేదని చెప్పారు. రేవంత్ రెడ్డితో చర్చకు కిషన్ రెడ్డి అవసరం లేదని తానొక్కడినే చాలు అని బూర నర్సయ్య పేర్కొన్నారు.