మంథని, వెలుగు: బీజేపీతోనే అణగారినవర్గాల అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. ఆదివారం మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి సునీల్‌రెడ్డి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని, దీనిలో భాగంగానే రూ.900 కోట్లతో ములుగు జిల్లాలో గిరిజన విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు.
అంతకుముందు మంథని మండలం ఏక్లాస్పూర్గ్రామానికి చెందిన సుమారు 80 మంది బీజేపీలో చేరారు. వారికి సునీల్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమాల్లో లీడర్లు వీరబోయిన రాజేందర్, బూడిద తిరుపతి, చిలువేరు సతీశ్, సత్యప్రకాశ్, సంతోష్, శ్రీనివాస్, మల్లికార్జున్, మౌనిక, నారాయణ పాల్గొన్నారు.