2020-21 రైతు ఆందోళనపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.రైతులపై కంగనా ఆవేశంతో చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ తీవ్రంగా మందలించింది. ఆమె చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని గట్టివార్నింగ్ ఇచ్చింది. అయితే మూడు కొత్త వ్వయసాయ చట్టాలపై కూడా ఆమె ఇటీవల వివాదాస్పద ప్రకటనలు చేశారు. దీంతో కంగనా రనౌత్ పై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ తీవ్రంగా మండిపడ్డారు. కంగనా రనౌత్ వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యమైనవి.. ఆమె మాటలు పట్టించుకోవద్దని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
Also Read:-ముంబైలో భారీ వర్షాలు
ఒక పంజాబీగా.. పంజాబ్, సిక్కు కమ్యూనిటీ రైతులకు వ్యతిరేకంగా కంగనా రనౌత్ చేసిన బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలతో.. రైతులకు పీఎం మోదీ చేసిన మంచి పనులపై ప్రభావం చూపుతాయని అన్నారు. కంగనా రనౌత్ బాధ్యతా రహితమైన ప్రకటనలు పంజాబ్ ప్రజలతో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న బంధంపై ఎటువంటి సందేహం కలిగించకూడదని అన్నారు.పంజాబీ, పంజాబీ యూత్ సంక్షేమం కోసం ప్రధాని మోదీ కృషి చేశారని షెర్గిల్ అన్నారు.