హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదంలో బీజేపీ నేత మృతి

హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదంలో బీజేపీ నేత మృతి

ముషీరాబాద్, వెలుగు: చిక్కడపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ సీనియర్ నాయకుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీజేపీ సీనియర్ నాయకులు రంగారాజు గౌడ్ (73) శుక్రవారం సాయంత్రం తన బైక్‌‌పై వెళ్తుండగా చిక్కడపల్లి మెట్రో స్టేషన్ వద్ద ఆటో ఢీకొనగా కింద పడి మృతి చెందాడు. 

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ తెలిపారు.