నిజామాబాద్, వెలుగు: ప్రభుత్వ పథకాల అమలులో పార్టీల ముసుగులో వివక్ష చూపడం సరికాదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దినేశ్హితవు పలికారు. నిజామాబాద్‌రూరల్ నియోజకవర్గంలోని అర్హులైన కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వకుండా వేధిస్తున్నారని, వెంటనే అందజేయాలని కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా దినేశ్మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బాజిరెడ్డి బీజేపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన లబ్ధిదారులకు శాంక్షన్అయిన కల్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తలేరని ఆరోపించారు. నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందకుండా చేయడం సరికాదన్నారు. ఆఫీసర్లు పారదర్శకంగా చెక్కులు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్న, అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గోడౌన్ రిపేర్ పనులు క్వాలిటీగా చేయాలి: కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
నిజామాబాద్, వెలుగు: ఈవీఎం గోడౌన్ రిపేర్పనులు క్వాలిటీతో చేయాలని కలెక్టర్సి. నారాయణ రెడ్డి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను సోమవారం ఆయన పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల లీడర్ల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్ర
పరిచిన గదులను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగుతున్న రిపేర్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన కలెక్టర్, అవి నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. గోడౌన్ నుంచి ఏ చిన్న వస్తువు కూడా బయటకు వెళ్లకుండా చూడాలన్నారు. వచ్చే ఆదివారం వరకు పనులు పూర్తి చేయాలని సూచించారు. రిపేర్పనుల్లో పాల్గొనే వారి పూర్తి వివరాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఈసీ అబ్జర్వర్పవన్, పంచాయతీ రాజ్ ఈఈ శంకర్ రాథోడ్, వివిధ పార్టీల ప్రతినిధులు ఉన్నారు.
పార్టీల పేరుతో స్కీమ్‌లను ఆపుతారా?
నిజామాబాద్, వెలుగు: ప్రభుత్వ పథకాల అమలులో పార్టీల ముసుగులో వివక్ష చూపడం సరికాదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దినేశ్హితవు పలికారు. నిజామాబాద్‌రూరల్ నియోజకవర్గంలోని అర్హులైన కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వకుండా వేధిస్తున్నారని, వెంటనే అందజేయాలని కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా దినేశ్మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బాజిరెడ్డి బీజేపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన లబ్ధిదారులకు శాంక్షన్అయిన కల్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తలేరని ఆరోపించారు. నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందకుండా చేయడం సరికాదన్నారు. ఆఫీసర్లు పారదర్శకంగా చెక్కులు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్న, అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రారంభం
కామారెడ్డి, వెలుగు: క్లయింట్ల న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి శ్రీదేవి చెప్పారు. సోమవారం కామారెడ్డిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు ఎల్లవేళలా సంస్థ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ట్రైనీ ఐఏఎస్శివేంద్రప్రసాద్, బార్అసోసియేషన్ ప్రెసిడెంట్అమృత్రావు, అడ్వకేట్లు, ప్రతినిధులు జగన్నాథం, దామోదర్‌రెడ్డి, శ్యాంగోపాల్, గంగాధర్, మసూద్ తదితరులు పాల్గొన్నారు.
ఈత వనం ఇస్తలేరని సామాజిక బహిష్కరణ
ధర్పల్లి, వెలుగు: సొంత పట్టా భూమిలో పెంచుకున్న ఈత వనాన్ని కులసంఘానికి అప్పగించనందుకు తమను వేధిస్తున్నారని ఇద్దరు వ్యక్తులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల వివరాల ప్రకారం.. ధర్పల్లికి చెందిన లింగాల రాజేశ్వర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్ అన్నదమ్ములు. వీరు 2018లో తమ సొంత భూమి 4 ఎకరాలలో అప్పటి కలెక్టర్ రామ్మోహన్రావు సమక్షంలో 1600 ఈత మొక్కలు నాటుకున్నారు. ప్రస్తుతం ఈత చెట్లు పెద్దవి కావడంతో గౌడ కుల సంఘం పెద్దలు ఈత వనం సంఘానికి అప్పగించాలని షరతులు పెట్టారు. అందుకు ఒప్పుకోకపోవడంతో తమ రెండు ఫ్యామిలీలను కుల బహిష్కరణ చేశారని బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. రూ. 40 లక్షలు ఖర్చు చేసి ఈతవనం పెంచుకుంటే సంఘానికి ఇవ్వమనడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. తమతో ఎవరు మాట్లాడుతున్నారో గమనించడానికి రూ.500 కూలికి ఓ మనిషిని పెట్టారన్నారు. మాట్లాడిన వారికి ఫైన్లు వేస్తున్నారని వాపోయారు. న్యాయం కోసం తాము కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. ప్రభుత్వ పెద్దలు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
ముందస్తు అరెస్టులు సిగ్గుచేటు
పంచాయతీ ఫండ్స్ దారి మళ్లించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో చేపట్టిన ధర్నాకు బయలు దేరిన కాంగ్రెస్ శ్రేణులను సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. కామారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావుతో పాటు , లీడర్లను స్టేషన్లకు తరలించారు. అరెస్టులకు నిరసనగా కాంగ్రెస్ యువజన, విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా కేంద్రాల్లో ఆందోళనకు దిగారు. కేసీఆర్ దిష్టిబొమ్మలను ఊరేగించి దహనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతియుతంగా ధర్నా చేస్తామంటే అరెస్టులు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. -– నెట్వర్క్, వెలుగు
ఏకపక్ష నిర్ణయాలు సరికాదు
నిజామాబాద్‌రూరల్, వెలుగు: జిల్లా కమ్మ సంఘం డైరెక్టర్ల సమావేశం నిర్వహించకుండానే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం సరికాదని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారావు అన్నారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న సుబ్బారావు వ్యక్తిగత కారణాలతో రెండు నెలల కింద అధ్యక్ష పదవికి రాజీనామా చేయగా, ఆదివారం సమావేశమైన కొందరు డైరెక్టర్లు కోఆప్షన్ మెంబర్ లక్ష్మీని ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నామని ప్రకటించారు. ఈ ఎన్నికను వ్యతిరేకిస్తూ ప్రధాన కార్యదర్శి కృష్ణారావుతో పాటు మరి కొంత మంది డైరెక్టర్లు సోమవారం సమావేశమయ్యారు. ఇంతకాలం మీటింగ్
పెడదామని సమాచారమిచ్చినా.. రాని వాళ్లు సడెన్‌గా ప్రెసిడెంట్‌ను ఎలా ఎన్నుకుంటారని ప్రశ్నించారు. ఈ ఎన్నికతో తాము ఏకీభవించమని, ఈ నెల 8న కొత్త ప్రెసిడెంట్ఎన్నిక
పారదర్శంగా నిర్వహించాలని కోరారు. డైరెక్టర్లు సురేశ్, రవీంద్రనాథ్ ఠాగూర్, రాము తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఆఫీసర్స్ క్లబ్ కొత్త కమిటీ ఎన్నిక
నిజామాబాద్‌రూరల్, వెలుగు: ‘నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్– - 2023’ కు కొత్త కమిటీని ఎన్నుకున్నారు. క్లబ్ప్రెసిడెంట్గా కలెక్టర్సి. నారాయణ రెడ్డి, వైస్‌ప్రెసిడెంట్లుగా నిజామాబాద్ సీపీ కెఆర్ నాగరాజు, అడిషనల్కలెక్టర్బి.చంద్రశేఖర్, టీఆర్ఎస్మాజీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, క్లబ్ సెక్రటరీగా గడ్కోల్ సంజీవరెడ్డి, జాయింట్ సెక్రటరీగా రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ బి.రామరాజు, ట్రెజరర్ గా రిటైర్డ్ ఏటీవో ఎ.శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎలక్షన్ఆఫీసర్లు శ్రీనివాస్ రెడ్డి, రాంప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యవర్గం ఏడాది పాటు కొనసాగుతుందని వారు చెప్పారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్సి. నారాయణరెడ్డిని, వైస్‌ప్రెసిడెంట్ కె.ఆర్ నాగరాజు మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేశారు. వారి చేతుల మీదుగా పేద స్టూడెంట్ల కోసం దుప్పట్లు, నోట్ బుక్స్, పెన్సిల్స్ అందజేశారు.
ఈఎస్ఐ ఆస్పత్రిలో వెల్నెస్ సెంటర్
నిజామాబాద్‌రూరల్, వెలుగు: ఎంప్లాయీస్, జర్నలిస్ట్ ల కోసం పనిచేస్తున్న వెల్నెస్సెంటర్ ను అన్ని వసతులతో కూడిన ఈఎస్ఐ హాస్పిటల్ లోకి మారుస్తున్నామని కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్‌పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు వెల్ నెస్ సెంటర్ పై కలెక్టర్ తో చర్చించారు. కలెక్టర్ ను కలిసిన వారిలో జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్రావు, సంఘం జిల్లా నాయకులు మదన్ మోహన్, ఈవీఎల్ నారాయణ, సుదర్శన్ రాజు, అందె సాయిలు, ప్రసాద్ రావు, రాధా కిషన్, పుండరీ, రామదాసు పాల్గొన్నారు.