కేసీఆర్ కు బీజేపీ అంటే భయం పట్టుకుందని..ఆ భయంతోనే దొంగ లెటర్లు సృష్టిస్తున్నారన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. భయంతో కేసీఆర్ కు నిద్రపట్టడం లేదన్నారు. టీఆర్ఎస్ ఇచ్చే వరద సాయం రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయన్నారు. ఓట్ల కోసమే ఎలాంటి లెక్క లేకుండా పైసలు పంపిణీ చేశారన్నారు. వరద సాయం రూ.550 కోట్లిచ్చిందన్నారు. డబ్బులు అకౌంట్లో వేయకుండా టీఆర్ఎస్ కార్యకర్తల జేబులో వేశారన్నారు. అందరికి రూ.10 వేలు ఇచ్చాకే ఎన్నికల నోటిఫికేషన జారీ చేయాల్సిందన్నారు. నోటిఫికేషన్ ఇచ్చింది మీరే..వరద సాయం ఆపింది మీరేనన్నారు. వరద సాయం పైసలన్నీ టీఆర్ఎస్ నాయకులే తిన్నారన్నారు. ఓటమి భయంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్నారు. ఎన్నికలయ్యాక వరద సాయం రూపాయి కూడా ఇవ్వరన్నారు. కేసీఆర్ కు కావాల్సింది జనాలు కాదు ఓట్లర్లన్నారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉండి దేశాన్ని అవమానిస్తారా? అని ప్రశ్నించారు. ఎంఐఎం లేకుంటే కేసీఆర్ కు దిక్కే లేదన్నారు. అభివృద్ధి చేస్తే ఇండ్లల్లకు నీళ్లెట్ల వచ్చాయన్నారు. ఎంఐఎం ఏం చేసిందో ముస్లీం సోదరులు ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమన్నారు అరుణ.