రాహుల్ మతం, కులమేంటి?: బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి

రాహుల్ మతం, కులమేంటి?: బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి

 

  • దేశ సంస్కృతి సంప్రదాయాలు ఆయనకి తెలుసా? 
  • కేవలం కాంగ్రెస్ రాజకీయ లబ్ధికే ​కులగణన
  • బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్: ‘కులగణన గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి ఉందా? అసలు ఆయన మతం, కులమేంటి?’ అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. దేశ సంస్కృతి సంప్రదాయాలు ఆయనకి తెలుసా? అన్నారు. బీజేపీ కులగణనకు వ్యతిరేకం కాదని, అయితే కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వం ఈకార్యక్రమం చేపడుతోందని ఆరోపించారు.

 నాంపల్లిలోని బీజేపీ స్టేట్ఆఫీసులో మహేశ్వర్​రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘బీసీ ఓటు బ్యాంక్ కోసమే కాంగ్రెస్ హడావుడి చేస్తోంది. ఇక్కడి కుల గణన పేరు చెప్పి మహారాష్ట్రలో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోంది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చేర్చిన 21 హామీలు గాలికి వదిలేశారు. పది మంత్రులు ఉంటే ఇద్దరు  బీసీలకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారు ఎందుకు?  రాహుల్ గాంధీ కులం, మతం ఏంటో ఆయన చెప్పుకోవాలి. 

ALSO READ : సమగ్ర కుటుంబ సర్వేతో అన్ని విధాలా లబ్ది: మంత్రి కొండా సురేఖ

అసలు హిందువునా క్రిస్టియానా! ఫిరోజ్ రాహూల్ జాంగిర్.. గాంధీ ఎలా అవుతారు ? ఆయన గురించి మాట్లాడిన వారిపై కర్ణాటకలో కేసులు పెట్టారు. ఇక్కడి ప్రభుత్వా నికి నేనేం భయపడను. గతంలో కిషన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డికి కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రూం లేదు. పొంగులేటిపై ఎంక్వైరీ జరుగుతుంది. అవినీతి చేసిన వారెవరూ తప్పించుకోలేరు’ అని స్పష్టంచేశారు.