కాంగ్రెస్​తో బీఆర్ఎస్​చీకటి ఒప్పందం : ఏలేటి మహేశ్వర్​రెడ్డి

కాంగ్రెస్​తో బీఆర్ఎస్​చీకటి ఒప్పందం : ఏలేటి మహేశ్వర్​రెడ్డి
  • అసెంబ్లీ చిట్​చాట్​లో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అవినీతిని వంద రోజుల్లో బయటపెడతానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పి.. 15 నెలలు గడుస్తున్నా.. ఎందుకు బయటపెట్టడం లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్​రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉన్న చీకటి ఒప్పందాలు ఒక్కొకటి బయటకు వస్తున్నాయని తెలిపారు. 

శనివారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన చిట్​చాట్ చేశారు. రేవంత్​తో హరీశ్ రావు భేటీ తర్వాతే కేటీఆర్ చెన్నై వెళ్లారని, అక్కడ సమావేశం జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి,  బీఆర్ఎస్ రహస్య ఒప్పందం బయట పడిందని చెప్పారు.