ఎస్ఎల్బీసీ దగ్గరికి సీఎం ఎందుకు పోలే? : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ఎస్ఎల్బీసీ దగ్గరికి సీఎం ఎందుకు పోలే? : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
  • మంత్రులు పిక్నిక్​లా వెళ్లొచ్చారు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇంతపెద్ద ప్రమాదం జరిగినా.. ఘటనా స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. మంత్రులు మాత్రం పిక్నిక్ కు వెళ్లినట్టుగా వెళ్లి వచ్చారని విమర్శించారు. 

ఆలోచన లేకుండా పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. శనివారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఆ ప్రాజెక్టు పనులను 45 ఏండ్లుగా నత్తనడకన చేపట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నిర్లక్ష్యం వల్లే ఎస్ఎల్బీసీ ఇంకా పూర్తికాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేటాయించిన నిధుల్లో సగం ఎస్ఎల్బీసీకి కేటాయించినా పూర్తయ్యేదని తెలిపారు. 8 మంది టన్నెల్ లో చిక్కుకుపోయేందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వ విధానాలేనని, ఇవి ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు.