మునుగోడులో ఓడిపోతామని తెలిసే పథకం ప్రకారం ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై దాడి చేశారని బీజేపీ నేతలు టీఆర్ఎస్ లీడర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి నిరసనగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీజేపీ లీడర్లు టీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కరీంనగర్ బీజేపీ సౌత్ జోన్ అధ్యక్షుడు నాగసముద్రం ప్రవీణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో దిష్టిబొమ్మ దహనం చేశారు.
అలాగే కోరుట్లలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, హుజూరాబాద్ లో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, వేములవాడలో బీజేపీ పట్టణ శాఖ అధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మంథనిలో పట్టణాధ్యక్షుడు ఎడ్ల సదాశివ్ ఆధ్వర్యంలో, జమ్మికుంటలో బీజేపీ కరీంనగర్ ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, మెట్ పల్లిలో టౌన్ ప్రెసిడెంట్ రమేశ్, వీణవంకలో మండలాధ్యక్షులు ఆదిరెడ్డి ఆధ్వర్యంలో, జగిత్యాలలో పట్టణాధ్యక్షుడు అనిల్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెలుగు, నెట్వర్క్