హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్మన్‌గా అర్హత లేని సత్యనారాయణ అనే వ్యక్తిని సీఎం కేసీఆర్ నియమించారని బీజేపీ నేత, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి అన్నారు. రెరా చట్టం, 2016 రూల్స్ ను రాష్ట్ర సర్కార్ ఉల్లంఘించి రెరా చైర్మన్‌ను నియమించిందన్నారు. రెరా చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి లేదా కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి లేదా కేంద్ర ప్రభుత్వంలో ఏదైనా సమానమైన పదవిని కలిగి ఉన్న వారే చైర్ పర్సన్‌గా నియమితులయ్యేందుకు అర్హులని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శి గా పనిచేసిన సత్యనారాయణను రెరా చైర్మన్‌గా నియమించింద న్నారు. ప్రస్తుత చైర్మన్‌ను బీఆర్‌ఎస్ నేతలు సులువుగా ప్రభావితం చేస్తారని, దీంతో రెరా చైర్మన్‌గా అర్హత గల వ్యక్తిని నియమించాలని డిమాండ్ చేశారు.