నవ వధువుతో బీజేపీ నేత పరార్​

నవ వధువుతో బీజేపీ నేత పరార్​

మెహిదీపట్నం, వెలుగు: కార్వాన్ నియోజకవర్గంలోని గోల్కొండ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు గురజాల అరవింద్(46) నిర్వాకం తీవ్ర చర్చనీయాంశమైంది. అరవింద్​కు ఇప్పటికే పెండ్లయి భార్య, పాప ఉండగా తాజాగా ఓ నవ వధువుతో పరారయ్యాడు. లంగర్ హౌస్ గొల్లబస్తీలో ఉండే యువతితో అరవింద్​కొన్నేండ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు. 15 రోజుల కింద ఆ యువతికి అత్తాపూర్ కు చెందిన యువకుడితో వివాహమైంది. 

అయితే మూడు రోజుల కింద అరవింద్​బండ్లగూడ సమీపంలోని ఆర మైసమ్మ ఆలయం వద్దకు ఆమెను పిలిచాడు. యువతిని తీసుకుని పారిపోయాడు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు కేసు ఫైల్ ​చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు సోమవారం లంగర్ హౌస్ లో అరవింద్ ఫొటోకు చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు.