బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి
మహబూబ్‌నగర్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందిందని బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీకి కేంద్రం రూ.166 కోట్లు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదన్నారు. సొమ్ము కేంద్రానిది అయితే సోకు రాష్ట్రానిదని ఎద్దేవా చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సెంట్రల్‌గవర్నమెంట్ కాటన్కార్పొరేషన్ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఈ ఏడాది దాదాపు రూ.3 వేల కోట్ల టర్నోవర్అయిందని, జిల్లాకు సుమారు రూ.75 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. కమీషన్ల కోసమే కలెక్టరేట్‌ను తరలిస్తున్నారని జితేందర్ రెడ్డి ఆరోపించారు. కలెక్టరేట్‌ను తరలిస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఎవరి భూముల రేట్లు పెరగాలని కలెక్టరేట్ తరలింపు చేపట్టారో అందరికీ తెలుసునని అన్నారు. జాతీయ రహదారులను అనుసంధానం చేసే ‘భారత్‌మాల’ రోడ్డు వస్తుంటే, కావాలనే బైపాస్వేయించిందెవరో పట్టణ ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఫ్రెండ్లీ ఫైట్ఉందని, బీజేపీకి ఓటేసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
మరిన్ని వార్తలు..
కొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి జంప్!
ఆస్పత్రి ఖర్చుల కోసం అప్పు ఇచ్చే.. హెల్త్ లోన్ కార్డ్
రెండేళ్ల పిల్లాడికి 102 ఏళ్లు.. నాలుగేళ్ల పిల్లాడికి 104 ఏళ్లు