ఎంఐఎంకు కాంగ్రెస్ భయపడుతున్నది: వెంకటేశ్వర్లు
హైదరాబాద్, వెలుగు: సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవం పేరుతో వేడుకలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ ప్రకారం విమోచన వేడుకలు నిర్వహిస్తున్నదని గుర్తు చేశారు.
బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆ పార్టీ నేతలు ప్రకాశ్ రెడ్డి, కుమార్ తో కలిసి కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఎంఐఎంకు భయపడి గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంగా వేడుకలు నిర్వహించడం లేదన్నారు. రజాకార్లు అందరూ ముస్లింలే అని విమర్శించారు. కానీ.. ముస్లింలందరూ రజాకార్లు కాకపోవచ్చు అని అన్నారు.