ఢిల్లీ: బీజేపీ చీఫ్ అమిత్ షా తో రాష్ట్ర నాయకులు భేటీ అయ్యారు. రానున్న లోక్ సభ ఎన్నికలలో పార్టీ వ్యూహాలను చర్చించారు. మీటింగ్ తరువాత బీజేపీ నేత కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం నుండి లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయడానికి.. ప్రతీ నియోజక వర్గం నుండి రెండు పేర్లు ఇవ్వాలని అమిత్ షా ఆదేశించినట్టు తెలిపారు.. అందులో నుండి ఒకరి పేరును పార్టీ నిర్నయించనున్నట్టు చెప్పారు.
రానున్న లోక్ సభ ఎన్నికలలో బీజేపీ విజయ ఢంకా మోగించనుందని… మోడీ మరోసారి ప్రధాని కాబోతున్నారని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు ఓటేసి తమ ఓటును దుర్వినియోగం చేసుకోవద్దని అన్నారు. టీఆర్ఎస్ 15 సీట్లు గెలిచినా తెలంగాణకు లాభం ఉండదని… అదే ఓటును బీజేపీకి వేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. టీఆర్ఎస్ కు కాంగ్రెస్ బీటీంగా మారిందని విమర్శించారు. తాను ఎంపీ గా పోటీ చేయాలన్నాదీ లేనిదీ పార్టీ నిర్ణయిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.