దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీని ప్రజలు మరోసారి ఆశీర్వదిం చాలని బీజేపీ సీనియర్ నేత కిషన్ డ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే కల్వకుంట్ల కుటుంబానికి గులాం గిరి చేయడానికి ఓటేసినట్టవుతుందని చెప్పారు. తెలంగాణ కోసం లాఠీ దెబ్బలు తిన్న తాను సికింద్రాబాద్ నుంచి బరిలో నిల్చానని, గెలిపిస్తే అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. బండారు దత్తా త్రేయ తనకు గురువని, ఎంపీ సీటు కోసం ఎటువంటి లాబీయింగ్ చేయలేదని, ఎన్నికల్లో ఆయన సపోర్టు ఎంతో ఉంటుం దని చెప్పారు. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆయనతో బుధవారం ‘వెలుగు’ ముచ్చటించింది . ఏం చెప్పారో ఓసారి చూద్దాం..
ప్రశ్న: ఈ ఎన్నికలలో ప్రచారం ఎలా ఉండబోతుంది ?
కిషన్ రెడ్డి: నామినేషన్ వేసిన వెంటనే ప్రచారానికి సంబంధించి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇప్పటికే సికింద్రాబాద్ పార్లమెంటరీ కార్యాలయం ప్రారంభించా. ప్రచారాన్ని ఉద్ధృతం చేయాల్సి ఉంది.
ప్రశ్న: సికింద్రాబాద్ సిట్టింగ్ సీటు కదా? ఈస్థానం నుంచి చాలా మంది పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కిషన్ డ్డి ఏం లాబీయింగ్ చేశారు. సీటు ఎలా వచ్చింది ?
కిషన్ రెడ్డి: ఎవర్ని అడగలేదు. పార్టీ ఎన్నికల ఇన్ చార్జి అరవింద్ లింబవలే అడిగారు. పోటీచేసే ఉద్దేశమేమైనా ఉందా అని? అప్పడు దత్తాత్రేయ ఒప్పుకుంటే చేస్తా అన్నాను. బలవంతంగా అయితే వద్దని చెప్పా. అలాగే పార్టీలో అందరూ మనస్ఫూర్తిగా సపోర్టు చేయాలని చెప్పా అంతే.
ప్రశ్న: దత్తా త్రేయ తప్పుకున్నారా? తప్పించారా?
కిషన్ రెడ్డి: ఏ నిర్ణయమైనా పార్టీ అధిష్ఠానమే తీసుకుంటుంది. టికెట్ విషయం పార్టీ ఇష్టం . దత్తాత్రేయకు ఎందుకు టికెట్ ఇవ్వలేదో? నాకుచెప్పలేదు. ఇంతవరకు అడగలేదు కూడా. ఈ విషయంలో ఢిల్లీ కూడా వెళ్లలేదు.
ప్రశ్న: సీటు వచ్చింది కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా!
కిషన్‌రెడ్డి: జనరల్ గా 1980 నుంచి 17 సంవత్సరాల పాటు పార్టీ ఆఫీసులో ఉన్నాను. పార్టీ ఆఫీసులో ఉండి కాలేజీకి వెళ్లి చదువుకున్నాను.పార్టీ ఆఫీసులో పెద్దలు, విలేకరులకు ఛాయ్‌లు అందించేవాడిని. కుర్చీలు కూడా వేసేవాడిని. ఇప్పటి కీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనే. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను తప్ప..ఎవరినీ ఒత్తిడికి గురిచేయను. లాబీయింగ్ చేయడం నాకు అలవాటు లేదు. నాపై స్వర్గీయ ఎమ్మెల్సీ వి.రామారావు ప్రభావం ఉంది. రాజకీయంగా ఆయనను ఆదర్శంగా తీసుకున్నాను.
ప్రశ్న: దత్తా త్రేయ సపోర్టు ఎలా ఉంది?
కిషన్‌రె డ్డి: నాకు ఆయన సపోర్టు చాలా ఉంటుంది. తొమ్మిదేళ్లు పార్టీ ఆఫీసులో కలిసే ఉన్నాం. నేను ఆయన శిష్యుణ్ని. సికింద్రాబాద్ సీటును కూడా ఆయన ఇన్నాళ్లు ముందుకు నడిపిస్తూ తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఆయన వెనుకుండి నన్ను ముందుకు నడిపిస్తారు.
ప్రశ్న: ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలు నెగ్గుకొస్తున్నాయి. ఈ టైమ్ లో బీజేపీ బలమైనప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కేసీఆర్ అంటున్నారు
కిషన్‌రె డ్డి: ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు కూడా కాదు. కుటుంబ పార్టీలు. జమ్మూకశ్మీర్ నుంచి మొదలు పెడితే ఉత్తర్‌ప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ , బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ ,తమిళనాడులో డీఎంకే, కర్నాటకలో దేవగౌడ కుటుంబం, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కుటుంబం, ఆంధ్రాలో చంద్రబాబు ఇవన్నీకుటుంబ పార్టీలే.
ప్రశ్న: బీజేపీ ఆ ట్రాప్ లో లేదా? కర్నాటకలోమీరు యడ్యూరప్ప, ఆయన కుమారుడికి ,శ్రీరాములు చెల్లెలికి టికెట్లు ఇచ్చారు కదా!
కిషన్‌రెడ్డి: అది వేరు పార్టీలో పనిచేస్తున్న వారికిటికెట్లు ఇవ్వడం వేరు. కుటుంబ పెత్తనం లేదు. మా పార్టీ నిర్ణయాలు పార్టీ ఆఫీసులో జరుగుతాయి. కుటుంబ పార్టీల్లో డైనింగ్ టేబుల్ పై నిర్ణయాలు జరుగుతాయి.
ప్రశ్న: మీకు మొత్తం ఎన్ని సీట్ల మీద గెలుపు ధీమా ఉంది ?
కిషన్‌రెడ్డి: ఎక్కువ సీట్లు గెలవాలనే లక్ష్యంతోనే పని చేస్తున్నాం. హైదరాబాద్‌తో పాటు పాలమూరు బహిరంగ సభకు నరేంద్ర మోదీ వస్తున్నారు. ఆ సభలతో వాతావరణం అనుకూలంగా మారనుంది. సికింద్రాబాద్‌లోని ముగ్గురు అభ్యర్థులను చూడండి . అందులో గుణగణాల్నిచూసి ఓటేయండని కోరుతున్నాను. బ్యాక్‌గ్రౌండ్, ప్రజా జీవితం, రాజకీయ చరిత్ర చూసి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ప్రశ్న: అంజన్‌కుమార్, తలసాని ఇద్దరూ బీసీకార్డుతో వెళ్తున్నారు. అదేమైనా మీకు ప్రతికూలంగా మారుతుందా?
కిషన్‌రెడ్డి: బీసీల కోసం పోరాటం చేసింది నేనే. తలసాని చేయలేదు. బీసీ సబ్ ప్లాన్ కోసం బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు మూడు రోజులపాటు ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష చేశాను.
ప్రశ్న: కేంద్రం నుంచి రాష్ట్రా నికి అదనంగా నిధులు రాలేదని టీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. మీరేమంటారు?
కిషన్‌రెడ్డి: అదనంగా ఎలా ఇస్తారండీ? ఏ రాష్ట్రానికీ అదనంగా ఇవ్వలేదు. నరేంద్రమోడీ గారు ఒక్కపైసా కూడా దుర్వినియోగం చేయలేదు. విద్యుత్ ప్రాజెక్టులు, నాలుగు లేన్ల రోడ్లు, 24 గంటల కరెంటు , పక్కన పడేసిన 11 ప్రాజెక్టులను రీఓపెనింగ్ వంటి ఎన్నో విషయాల్లో కేంద్రం సహకరిచింది. సకాలంలో నిధులు ఇచ్చింది.
ప్రశ్న: భయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదని టీఆర్‌ఎస్ చెబుతోంది.
కిషన్‌రెడ్డి: భయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రం ఆలోచించింది. కేంద్రం చేసిన అంతర్గత అధ్యయనంలో సాధ్యం కాదని తేలింది. అందుకే ఇవ్వలేదు. ఈ అంశంపై టీఆర్‌ఎస్ అబద్దాలు మాట్లాడటం మొదలుపెట్టింది. సీఎం కేసీఆర్ స్థాయి తగ్గి మాట్లా డుతున్నారు.
ప్రశ్న: బీజేపీకి ఓటేస్తే మోదీకేసినట్టు, కాంగ్రెస్‌కు ఓటేస్తే రాహుల్ కు వేసినట్టు, కారుకు వేస్తే రాష్ట్ర ప్రయోజనాలకు ఓటేసినట్టు అని అంటున్నారు.
కిషన్‌రెడ్డి: మీకు గులాబీలు కావాలా? గులాములుకావాలా ? టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే కల్వకుంట్ల కుటుంబానికి గులాంగిరి చేయడానికి ఓటేసినట్టవుతుంది. నరేంద్రమోదీకి ఓటేస్తే దేశానికి ఓటేసి-ట్టు. దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నమోదీని ఆశీర్వదించాలని కోరుతున్నాను.
ప్రశ్న: టీఆర్‌ఎస్ 16 సీట్లు, ఎంఐఎం 1సీటుతో కలిపి రాష్ట్రంలోని అన్ని సీట్లను స్వీప్ చేస్తామని చెబుతోంది .మీరేమంటారు?
కిషన్‌రె డ్డి: కేసీఆర్ చెబుతున్నారు కదా!సారు.. కారు.. పదహారు.. దిల్లీ సర్కారుఅని. టీఆర్‌ఎస్ పార్టీకి ఓటేస్తే కేసీఆర్ సారు.. కారు.. బేకారు అని మేం తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ కుటుంబ పార్టీలు. టీఆర్‌ఎస్ పార్టీకి ఓటేస్తే ఒరిగేదేమీ ఉండదు. దేశం పటిష్ఠం గా ఉండాలంటే సమర్థమైన ప్రధాని ఉండాలి. అప్పుడే దేశంలో ఏవైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు మనం స్పేస్ రంగంలో కూడా ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం. బ్లాక్ మెయిల్ కు బలైన ప్రభుత్వాలు కావాలా? సమర్థవంతుడైన నరేంద్రమోడీ కావాలా? అని ఓటర్లు తేల్చుకోవాలి.
ప్రశ్న: టీఆర్‌ఎస్ 16 సీట్లు గెలుస్తామని చెబుతోంది. ఈ ప్రభంజనంలో మీరుఎలా నిలదొక్కుకుంటారు?
కిషన్‌రె డ్డి: అది వాస్తవం కాదు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు మాత్రమే ఓటు వేయరు.ప్రజలు ఓటు వేస్తారు. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో చూడాలి. అందుకే ఇటీవల కేసీఆర్, కేటీఆర్ బీజేపీపై విపరీతమైన విష ప్రచారం చేస్తున్నారు.సర్వేలలో బీజేపీకి అనుకూల ఫలితాలు రావడం వల్లే భయంతో ఇలాంటి ప్రచారంచేస్తున్నారు
ప్రశ్న: తెలంగాణ ఉద్యమకారుల్ని గెలిపిస్తే ఢిల్లీలో మన వాయిస్ వినిపిస్తాం . కాని వారికి ఇస్తే ఢిల్లీలో మోకరిల్లుతారని టీఆర్‌ఎస్ వాళ్లు అంటున్నారు.
కిషన్‌రె డ్డి: ఈ రోజు టీఆర్‌ఎస్‌లో తెలంగాణవాదులెవరు ఉన్నారు. తెలంగాణ వాదులు ఎక్కడోపోయారు. ఈ రోజు తెలంగాణలో ఎంపీస్ 100 క్రోర్స్ క్లబ్ ఏర్పాటు చేశారు. తలసాని, మల్లా-రెడ్డి సహా మహబూబ్‌నగర్, నల్గొండ అభ్యర్థులెవరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. తెలంగాణ ఉద్యమంతో సంబంధంలేని మంత్రులెంత మంది లేరు. నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొ న్నాను. ఢిల్లీకి వెళ్లి లాఠీ ఛార్జిలో దెబ్బలు తిన్నాను. తెలంగాణకు అనుకూలంగా పార్లమెం టులో 160 మంది ఎంపీల మద్దతు కూడగట్టాను.