వర్సిటీ భూములపై అఖిలపక్ష కమిటీ వేయాలి : మహేశ్వర్ రెడ్డి

వర్సిటీ భూములపై అఖిలపక్ష కమిటీ వేయాలి :  మహేశ్వర్ రెడ్డి
  • బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి  

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై వెంటనే అఖిలపక్ష కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిర్బంధ, అరాచక పాలన సాగుతోందని ఆయన ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూములను అమ్ముకోవడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పని చేస్తోందన్నారు. 

భూములను అమ్మడం, రియల్ ఎస్టేట్ దందా చేయడమే సర్కార్​లక్ష్యమా? అని ప్రశ్నించారు. సెంట్రల్ యూనివర్శిటీ భూములను పరిశీలించడానికి వెళ్తున్న ఎమ్మెల్యేలను అడ్డుకోవడం దారుణమన్నారు. తాము ఆ భూముల దగ్గరకు వెళ్తామని, విద్యార్థులకు అండగా నిలబడతామని స్పష్టం చేశారు. భూముల వేలం ఆపకపోతే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.