
2024 ఎన్నికలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా పార్టీని బలోపోతం చేయనున్నట్లు చెప్పారు ఆ పార్టీ నాయకులు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో సభ్యత్వనమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ చీఫ్ అమిత్ షా పచ్చజెండా ఊపితే ఏపీ లోని టీడీపీ ఖాళీ అవుతదని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిని బయట పెట్టి అందుకు కారణమైన నాయకులపై, అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ను కోరారు.
జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని అన్నారు మాణిక్యాలరావు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని అక్కడి ప్రజలు వలసలుపోతున్నారని అన్నారు. కరువు నివారణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.