కేసీఆర్ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసే సమయం ఆసన్నమైందని బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఈనెల 15న జరిగే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు రావాలని పిలుపునిస్తూ కరీంనగర్ టవర్ సర్కిల్లో బీజేపీ నేతలు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గంగాడు కృష్ణారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామిక తెలంగాణ కోసమే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారని తెలిపారు. 15న జరిగే బహిరంగ సభతో బీజేపీ శక్తి చూపెడుదామని.. సభను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. కుటుంబ పాలనలో బందీ అయిన తెలంగాణ తల్లి విముక్తి, ప్రజాస్వామిక తెలంగాణే తమ లక్ష్యమని అన్నారు.