ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

  • భువనగిరి మున్సిపల్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో నిలదీసిన కౌన్సిలర్లు

యాదాద్రి, వెలుగు : ‘మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు వచ్చాయా ? వస్తే ఏఏ పనులు చేశారు.. మిగతా వాటిని ఎప్పుడు పూర్తి చేస్తారు ?’ అని పలువురు కౌన్సిలర్లు నిలదీశారు. యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ జనరల్‌‌‌‌‌‌‌‌ బాడీ మీటింగ్‌‌‌‌‌‌‌‌ను బుధవారం నిర్వహించారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌ ప్రారంభం కాగానే బీజేపీ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ మాయ దశరథ మాట్లాడుతూ టీయూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐడీసీ నుంచి అప్పు రూపంలో రూ. 16.50 కోట్ల ఫండ్స్‌‌‌‌‌‌‌‌ వచ్చా ? లేదా ?, వస్తే వాటితో ఎక్కడెక్కడ పనులు చేశారని ప్రశ్నించారు. పనులు చేయకుండానే చేశామంటూ చెప్పుకోవడం సరికాదన్నారు. ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌కు బిల్లులు రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసినప్పటికీ ఇంకా పనులు పెండింగ్‌‌‌‌‌‌‌‌ ఉండడం ఏమిటని నిలదీశారు. భువనగిరి పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యేందుకు ఇంకా ఎంత టైం పడుతుందని ప్రశ్నించారు. ఇతరాల పేరుతో ఖర్చు చేసిన డబ్బులను ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. దీంతో మొత్తం వివరాలను వచ్చే మీటింగ్‌‌‌‌‌‌‌‌లో అందిస్తామని కమిషనర్‌‌‌‌‌‌‌‌ నాగిరెడ్డి చెప్పారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఎనబోయిన ఆంజనేయులు, చింతల కిష్టయ్య, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ పొత్నక్‌‌‌‌‌‌‌‌ ప్రమోద్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

పథకాలు నచ్చే పార్టీలో చేరుతున్రు

కోదాడ, వెలుగు : బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే చాలా మంది ఆ పార్టీలో చేరుతున్నారని సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాలకు చెందిన పలువురు బుధవారం పార్టీలో చేరగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత, కొత్త అన్న తేడా లేకుండా కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి వచ్చాక గ్రామాల రూపురేఖలే మారిపోయాయన్నారు. కోదాడను అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు దేవబత్తిని సురేశ్‌‌‌‌‌‌‌‌, ఉపేందర్, సర్పంచ్‌‌‌‌‌‌‌‌ కృష్ణ, రణబోతు
రామిరెడ్డి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

దేవరకొండ (కొండమల్లేపల్లి), వెలుగు : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చిన్నఅడిశర్లపల్లిలో బుధవారం గ్రామ పంచాయతీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌, శ్మశానవాటికను ప్రారంభించి, దోనియాలలో శ్మశానవాటిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకులు కడారి అంజయ్యయాదవ్, కేసాని లింగారెడ్డి పాల్గొన్నారు.

చంద్రమౌళికి నివాళి అర్పించిన జానారెడ్డి

హాలియా, వెలుగు : కోదాడ ప్రభుత్వ జూనియర్‌‌‌‌‌‌‌‌ కాలేజీ లెక్చరర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న, నల్గొండ జిల్లా హాలియాకు చెందిన కుకుడాల చంద్రమౌళి ఇటీవల చనిపోయారు. విషయం తెలుసుకున్న సీఎస్పీ మాజీ లీడర్‌‌‌‌‌‌‌‌ కుందూరు జానారెడ్డి బుధవారం చంద్రమౌళిక ఫొటో వద్ద నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట కుందూరు జైవీర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కాకునూరు నారాయణగౌడ్, తుమ్మలపల్లి చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కుందూరు వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, చింతల చంద్రారెడ్డి ఉన్నారు.

‘మన ఊరు మన బడి’ పనులు స్పీడప్‌‌‌‌‌‌‌‌ చేయండి

నకిరేకల్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ‘మన ఊరు మన బడి’ కింద స్కూళ్లలో జరుగుతున్న పనులను స్పీడప్‌‌‌‌‌‌‌‌ చేయాలని నకిరేకల్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశించారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌‌‌‌‌‌‌‌లోని గర్ల్స్‌‌‌‌‌‌‌‌ హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న పనులను టాయిలెట్స్‌‌‌‌‌‌‌‌, కాంపౌండ్‌‌‌‌‌‌‌‌ వాల్‌‌‌‌‌‌‌‌ నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు. ప్రభుత్వ విద్యావ్యవస్థపై సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. నకిరేకల్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ వ్యాప్తంగా 85 స్కూళ్లలో అభివృద్ధి పనులకు రూ. 25 కోట్లు మంజూరు చేయించినట్లు చెప్పారు. జీఎంఆర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగానే నకిరేకల్‌‌‌‌‌‌‌‌ – తిప్పర్తి రోడ్డులో అండర్‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌ వద్ద  పనులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో పనులను ప్రారంభించాలని ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ హయాంలోనే పేదల అభివృద్ధి

హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసింది కాంగ్రెస్సేనని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్‌‌‌‌‌‌‌‌ కట్‌‌‌‌‌‌‌‌ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ హయాంలోనే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ కల్పించినట్లు గుర్తు చేశారు. భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఈడుపుగంటి సుబ్బారావు, యరగాని నాగన్నగౌడ్, అల్లం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, బాచిమంచి గిరిబాబు, తన్నీరు మల్లిఖార్జున్‌‌‌‌‌‌‌‌, కోతి సంపత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, అజీజ్‌‌‌‌‌‌‌‌ పాషా, అప్పారావు, మంజీ నాయక్, మేళ్లచెరువు ముక్కంటి పాల్గొన్నారు. 

ఉమ్మడి జిల్లాలో...

యాదగిరిగుట్ట/దేవరకొండ/కోదాడ, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట, నల్గొండ జిల్లా దేవరకొండ, సూర్యాపేట జిల్లా కోదాడలో ఆ పార్టీ నాయకులు జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్‌‌‌‌‌‌‌‌ కట్‌‌‌‌‌‌‌‌ చేసి పంపిణీ చేశారు. గుట్టలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య, దేవరకొండలో పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ దూదిపాళ వేణూధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ యూనుస్‌‌‌‌‌‌‌‌, కొర్ర రాంసింగ్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌, కోదాడలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షుడు వంగవీటి రామారావు, డీసీసీ ఉపాధ్యక్షుడు పారా సీతయ్య పాల్గొన్నారు.

హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ పాలసీతో పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ సిబ్బందికి ఉద్యోగ భద్రత

యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ పాలసీతో పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ సిబ్బందికి ఉద్యోగ భద్రత ఏర్పడిందని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. ఈ పాలసీ వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌ పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులకు కూడా వర్తిస్తాయన్నారు. పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్లు, డైరెక్టర్లు, ఉద్యోగులతో బుధవారం యాదగిరిగుట్టలో నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. ఈ పాలసీ వల్ల పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులకు బేసిక్‌‌‌‌‌‌‌‌ శాలరీపై 11 శాతం హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఏ, ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌తో పాటు, రూ.50 వేల వరకు పర్సనల్‌‌‌‌‌‌‌‌ లోన్లు తీసుకునే సౌకర్యం కూడా ఉంటుందన్నారు. హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ పాలసీతో రాష్ట్రంలో 5 వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందన్నారు. అప్పుల ఊబిలో ఉన్న డీసీసీబీని లాభాల్లోకి తెచ్చేందుకు కృషి చేశామన్నారు. రూ.900 కోట్లుగా ఉన్న టర్నోవర్‌‌‌‌‌‌‌‌ను ప్రస్తుతం రూ.2,050 కోట్లకు తీసుకొచ్చామన్నారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఇమ్మడి రాంరెడ్డి, బొమ్మలరామారం, రాజాపేట, ఆలేరు, తుర్కపల్లి మండలాల పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్లు గూదె బాల్‌‌‌‌‌‌‌‌నర్సయ్య, భాస్కర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మల్లేశ్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, నరసింహారెడ్డి పాల్గొన్నారు.

కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

సూర్యాపేట, వెలుగు : కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ సిబ్బందికి కూడా పీఆర్‌‌‌‌‌‌‌‌సీ అమలు చేసిన చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని విద్యుత్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కేవీ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ యూనియన్‌‌‌‌‌‌‌‌లో బుధవారం పలువురు కార్మికులు చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ కార్మికులకు సైతం 30 శాతం పీఆర్‌‌‌‌‌‌‌‌సీ అమలు చేయాలని గుర్తు చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల కోసం ప్రతియేటా రూ. 60 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. సూర్యాపేటలో ఈఎస్‌‌‌‌‌‌‌‌ఐ ఏర్పాటుకు కృషి చేస్తానని, కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వల్దాసు మధుసూదన్‌‌‌‌‌‌‌‌, చాగంటి వెంకటరమణతో పాటు పలువురు కార్మికులు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కేవీలో చేరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌‌‌‌‌ నిమ్మల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ యూనియన్‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర అధ్యక్షుడు చిలువేలు ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు జల్లి కృష్ణ   తదితరులు పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

చండూరు (మర్రిగూడ), వెలుగు : నల్గొండ జిల్లా మర్రిగూడ మండలానికి చెందిన పలువురికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌‌‌‌‌‌‌‌ చెక్కులను బుధవారం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకంతో పేద కుటుంబాలపై భారం తగ్గిందన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పాశం సురేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎంపీపీ మెండు మోహన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి పాల్గొన్నారు.

వ్యవసాయ కార్మిక సంఘం సభను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలి

మిర్యాలగూడ, వెలుగు : ఈ నెల 29 నుంచి 31 వరకు ఖమ్మంలో నిర్వహించనున్న వ్యవసాయ కార్మిక సంఘం బహిరంగ సభను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలని మాజీ ఎమ్మెల్యే, అఖిల భారత కిసాన్‌‌‌‌‌‌‌‌ సభ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని సీపీఎం ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో బుధవారం నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. పంటలకు గిట్టుబాటు ధర అందకపోవడంతో రైతులు, రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. పూర్తైన డబుల్‌‌‌‌‌‌‌‌ ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్‌‌‌‌‌‌‌‌ మల్లేశ్‌‌‌‌‌‌‌‌, జిల్లా కమిటీ సభ్యుడు మూడావత్‌‌‌‌‌‌‌‌ రవినాయక్‌‌‌‌‌‌‌‌, పాతూరి శశిధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, రెముడాల పరశురాములు పాల్గొన్నారు.