నిజామాబాద్, వెలుగు: పార్టీ క్రమశిక్షణను ఉల్లఘింస్తున్నందున అర్బన్ సెగ్మెంట్‌కు చెందిన మీసాల శ్రీనివాస్‌రావును సస్పెండ్ చేసినట్లు బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్ కులాచారి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఆయన ప్రాథమిక సభ్యత్యాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
సస్పెన్షన్ తక్షణం అమల్లోకి వస్తుందన్నారు. ధర్మపురి అర్వింద్‌కు ఎంపీ టికెట్ ఇవ్వొద్దని పార్టీ అధిష్టాన వర్గాన్ని ఢిల్లీ వెళ్లి కలిసిన మీసాల శ్రీనివాస్‌రావు ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. అయితే ఆయన నామినేషన్ రిజెక్ట్ అయింది.