ప్రభుత్వాలు మారుతాయి తప్పా పెన్షన్లు ఆగవు: ఎంపీ అరవింద్

జగిత్యాల: తెలంగాణలో ప్రభుత్వం మారుతుంది గానీ పెన్షన్లు ఆగవు అని బీజేపీ నేత, ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలో ప్రచారం నిర్వహించిన అరవింద్..బీజేపీ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు. ప్రధాని మోదీ దేశంలో ప్రతి ఇంటికి ఐదు లక్షల ఆరోగ్య బీమా ఇస్తే తెలంగాణలో సీఎం కేసీఆర్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇచ్చి లక్షలు దోచుకుంటున్నాడని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే యువత, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం రాని వారిని ఉపాధికోసం లోన్లు ఇస్తామని చెప్పారు.