- అమిత్ షాకు బీజేపీ నేత పొంగులేటి వినతి
న్యూఢిల్లీ, వెలుగు: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సహకారం అందించాలని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వినతిపత్రం అందజేశారు.
ధానంగా తెలంగాణలో మున్నేరు పొంగి ఖమ్మం, భధ్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో తీవ్ర ఆస్తినష్టం జరిగిందని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని షా దృష్టికి తీసుకెళ్లారు.
అందువల్ల తెలంగాణకు ప్రత్యేక ఆర్థిక సహకారంతో పాటు, భవిష్యత్తులో మున్నేరు పొంగకుండా చర్యలు చేపట్టాలని కోరారు.