హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్ రామిరెడ్డిని అరెస్ట్ చేయాలని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకట్ రామిరెడ్డి పాత్ర ఉందని మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ ఇచ్చాడు. వెంటనే వెంకట్ రామిరెడ్డిని అరెస్టు చేయాలని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమ యంలో వెంకట్ రామిరెడ్డికి సంబంధించిన మూడు కోట్లు తరలించినట్లు రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ ఇచ్చారన్నారు. అయితే ఇప్పటివరకు వెంకట్ రామిరెడ్డిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
వెంకట్ రామిరెడ్డిని ఎందుక అరెస్ట్ చేయడం లేదో.. ఆయనను ఎవరు కాపాడుతున్నారో చెప్పాలన్నారు. మంత్రి పొంగులేని వియ్యంకుడు కావడంవల్లే వెంకట్ రామిరెడ్డిని అరెస్ట్ చేయడం లేదా... ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని రఘునందన్ రావు అన్నారు. వెంకట్ రామిరెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యాలున్నా.. ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.మాజీ డీసీసీ రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ ఆధారంొగా వెంకట్ రామిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని రఘునందన్ రావు డీజీపీని కోరారు.