వారం రోజులుగా కనిపించకుండా పోయిన మహారాష్ట్రకుె చెందిన బీజేపీ మైనారిటీ విభాగం చీఫ్ సనా ఖాన్ మిస్టరీ వీడింది. ఆమెను ఆమె భర్తే హత్య చేసినట్లు జబల్‌పూర్ పోలీసులు వెల్లడించారు. జబల్‌పూర్, నాగ్‌పూర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో ప్రధాన నిందితుడు అమిత్ అలియాస్ పప్పు సాహును పోలీసులు అరెస్టు చేశారు.
గతకొంతకాలంగా సనా, పప్పుల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో సనా ఖాన్‌ను హత్య చేసినట్లుగా అమిత్ పోలీసులుఎదుట ఒప్పుకున్నాడు. సనా ఖాన్ ను చంపిన తరువాత జబల్‌పూర్‌కు దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిరాన్ నదిలో ఆమె మృతదేహాన్ని విసిరివేసినట్లుగా తెలిపాడు.
సనా, అమిత్‌లకు వివాహమైందని, డబ్బు విషయంలో వీరిద్దరికి చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. అమిత్‌ని కలవడానికి సనా నాగ్‌పూర్ నుండి జబల్‌పూర్‌కు వచ్చిందని అయితే అక్కడ ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో.. అమిత్ సనా తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
అయితే ఈ కేసులో మరొకరి ప్రమేయం ఉందని, ఆ వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. సనా ఖాన్ ఆగస్టు 2న నాగ్‌పూర్ నుండి జబల్‌పూర్‌కు వచ్చి ఆ తర్వాత కనిపించకుండా పోయింది. జబల్‌పూర్‌కు చేరుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఆమెను వెతకడానికి ప్రయత్నించినప్పటికీ, ఆమె ఆచూకీ తెలియలేదు.